టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కొత్తళ్లుగా హంగామా చేశారు. అత్తవారింట్లో గెస్ట్‌గా వెళ్లి సందడి చేశారు. అత్తా మామలతో కలిసి విజయదశమిని ఎంజాయ్ చేశారు. కొత్తల్లుడిని ఇంటికి ఆహ్వానించిన అత్తా మామా అల్లుడు ఇంటికి వచ్చిన ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ ఆనందకర సమయాలకి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ఇన్ స్టాలో షేర్ చేసి మురిసిపోయారు.
రానా ఆంటీ, మిహీకా బజాజ్ మదర్ బంటీ బజాజ్ షేర్ చేసిన ఫొటోలు ఇన్‌స్టా లో సందడి చేస్తున్నాయి. మేలో తను ప్రేమిస్తున్నానని, తను ప్రేమిస్తున్న ఆమ్మాయి ఈమే అంటూ రానా తన ప్రేయసి మిహీకా బజాజ్ ఫొటోని షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో ఆగస్టు 8న రానా, మిహీకాల వివాహం జరిగింది.
పెళ్లి తరువాత కొంత విరామం తీసుకున్నా రానా జంట హానీమూన్ వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలని రానా వైఫ్ మిహీకా బజాజ్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. తాజాగా పెళ్లి తరువాత తొలి ఫెస్టివల్ కావడంతో రానా తన భార్యతో కలిసి అత్తారింట్లో పండగని ఎంజాయ్ చేశారు. అత్తరాఇంట్లో కొత్తల్లుడు రానా సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవులున్నాయి.