పోలవరంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కీలక వాస్తవాలు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చాయి. పోలవరం డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని, పునరావాసంతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. 2015 నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం కేంద్రం, నాబార్డు నుంచి రూ. 8614.16 కోట్లు రావాల్ది ఉంది. పోలవరానికి కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 950 కోట్లు, నాబార్డు ద్వారా రూ. 7664.16 కోట్లు రావాలి. ఆ లెక్కన కేంద్రం నుంచి రావాల్సిన పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు రూ. 2234.77 కోట్లు దాకా ఉన్నాయి.
ఇప్పటి వరకు పునరావాసంతో సహా 41.05 శాతం మేర పోలవరం నిర్మాణం పూర్తయింది. 71.54 శాతం మేర పోలవరం డ్యామ్ నిర్మాణం కూడా పూర్తయింది. అయితే పునరావస పనులు కేవలం 19.85 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కేంద్రం క్లారిటీతో పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. పునరావాసానికే సుమారు రూ. 33 వేల కోట్ల దాకా అవుతుందని అంచనా. అయితే ఇప్పటి వరకు సుమారుగా రూ. 3500 కోట్ల మేర పునరావాసానికి ఖర్చు చేశారు. పునరావాసానికి ఇంకా రూ. 29 వేల కోట్లకు పైగా అవసరం ఉంది. ఈ 29 వేల కోట్లను భరించే పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అయితే లేదు.