త్వరలోనే రానా నాయుడు సీజన్ 2 : వెంకటేష్

-

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ , బాహుబలి స్టార్ రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ హిందీ వెబ్ సిరీస్‌ ఫస్ట్ సీజన్‌ గత నెలలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌‌లో విడుదలైంది. కంటెంట్ పరంగా ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇందులో బూతుల గోల ఎక్కువగా ఉండటంతో తెలుగులో ఈ సిరీస్‌కు పెద్దగా ఆదరణ లభించలేదు. పైగా బూతు పదాల పట్ల విమర్శలు రావడంతో ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్‌ను స్ట్రీమింగ్ నుంచి తొలగించింది నెట్‌ఫ్లిక్స్. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సిరీస్ సెకండ్ సీజన్ గురించి అధికారికంగా ప్రకటించడం విశేషం.

రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ 2 త్వరలో వస్తుందని.. హీరో వెంకటేష్ అన్నారు. మొదటి సీజన్ లో నాగా నాయుడు ఏం చేసాడో తెలియదని.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సిరీస్ చూశారని చెప్పారు. ఎవ్వరినీ హర్ట్ చేయకుండా సీజన్ 2 లో జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. మొదటి సీజన్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకొన్నామన్నారు. ఈ సిరీస్ లో వెంకి నాగా నాయుడు పాత్రను పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news