అది అస్సాం పోయినా ఇది నిలబెట్టింది..

హీరో నితిన్ నుండి ఈ సారి రెండు సినిమాఅలు వచ్చాయి. కరోనా మహమ్మారి ఇంకా ఉండగానే రెండు సినిమాలు థియేటర్లలో రావడం చిన్న విషయం కాదు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన చెక్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన రంగ్ దే చిత్రాల్య్ బాక్సాఫీసుని పలకరించాయి. ఐతే ఇందులో రంగ్ దే సినిమాకి చక్కటి రెస్పాన్స్ వస్తుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రానికి వసూళ్ళ వర్షం కురుస్తుంది. మార్చి 26వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే 10కోట్ల షేర్ ని రాబట్టింది.

దీంతో హీరో నితిన్ హ్యాపీగా ఉన్నాడు. చెక్ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి కూడా తెలియదు. ప్రేక్షకులకి పెద్దగా రుచించని ఆ సినిమాతో నితిన్ కి మరో ఫ్లాప్ వచ్చి చేరింది. దాంతో రంగ్ దే సినిమాపై నమ్మకాలు తగ్గాయి. కానీ యువతకి కావాల్సిన అంశాలతో పాటు కుటుంబాలని టచ్ చేసే ఎమోషన్స్ ఉండడంతో విజయవంతంగా రన్ అవుతూ ఉంది. మొత్తానికి నితిన్ అన్నట్టు చెక్ అస్సాం పోయినా రంగ్ దే విజయం అందుకుంది.