నేను వైసీపీ కార్యకర్తను… ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు

జనసేన నుండి ఎమ్మెల్యేగా గెలిచి అనంతర పరిస్థితులలో పవన్ కి షాకిచ్చి జగన్ తో సన్నిహితంగా మెలుగుతున్నారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద రావు. తాజాగా మరో సారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలులో ఇళ్ళు స్థలాలు పంపిణీలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ను ఉద్దేశించి ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.

నేను వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తనేనన్న ఆయన ముఖ్యమంత్రి నన్ను పార్టీలో కొనసాగమని  చెబుతుంటే మీకు అభ్యంతరం ఏంటి ? అని ఆయన ప్రశ్నించారు. ఇక అందరు ఫిరాయింపుదారు ఎమ్మెల్యేల లాగానే వర ప్రసాద్ కూడా కొడుకుని వైసీపీలో చేర్చి ఆయన సాంకేతికంగా జనసేన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఇక మరోపక్క పవన్ జగన్ ని రకరకాల విమర్శలతో టార్గెట్ చేస్తుంటే తాను మాత్రం జగన్ భజన చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది.