మధ్యప్రదేశ్ లో దారుణం… నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.

కామాంధులు రోజురోజుకు బరి తెగిస్తున్నారు. వావీవరసలు, చిన్నా పెద్ద తారతమ్యాలు లేకుండా అత్యాచారాలను పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. దేశంలో నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలను తీసుకువచ్చిన కామాంధుల్లో భయం రావడం లేదు. తాజాగా మరో చిన్నారి కామాంధుడి అఘాయిత్యానికి బలైంది.

rape

నాలుగేళ్ల చిన్నారిపై కాామాంధుడు అత్యాచారం చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఇంటి బయట అడుకుంటున్న చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఇంటి సమీపంలో నివసించే యువకుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం  చేశాడు. అనంతరం నిందితుడి ఇంటి నుంచి బయటకు వచ్చిన చిన్నారి.. తల్లిదండ్రులకు ఈవిషయం చెప్పింది. దీంతో తల్లితండ్రులు నిందితుడిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకున్నారు. నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చికిత్స నిమిత్తం చిన్నారిని స్థానికి ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్యంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.