తమిళనాడు చేరుకున్న కేసీఆర్‌.. రేపు స్టాలిన్ తో స‌మావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ త‌మిళ నాడు చేరుకున్నారు. కాసేప‌టి క్రిత‌మే.. త‌మిళ నాడు రాష్ట్రంలోని.. శ్రీ రంగం కు కుటుంబ స‌భ్యుల‌తో పాటు చేరుకున్నారు సీఎం కేసీఆర్‌. రంగ నాథ స్వామి ఆల‌య ప్రాంగణంలో సీఎం కేసీఆర్ కు పూర్ణ కుంభ స్వాగ‌తం ల‌భించింది. తిరుచ్చి జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌నివాసు త‌మిళ‌నాడు మంత్రి అరుణ్ నెహ్రు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

ఇక రేపు తమిళనాడు సీఎం స్టాలిన్ తో సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. రేపు తిరుత్తణి లో ఓ కార్యక్రమం లో పాల్గొన్న తర్వాత… సీఎం కేసీఆర్ తో భేటి కానున్నారు త‌మిళ నాడు ముఖ్య మంత్రి స్టాలిన్. స్టాలిన్ నివాసం లో రేపు సాయంత్రం‌ 4-5 గంటల మధ్య ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఇక ఇవ్వాళ రాత్రికి ITC హోటల్ సీఎం కేసీఆర్ ఫ్యామిటీ బస చేయ‌నుంది.