కొడుకు లవర్ పై తండ్రి కన్ను.. బలవంతంగా లైంగిక దాడి

-

మహిళలు, బాలికలు పట్ల దేశంలో అత్యాచారాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాాలు నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధులు బెదరడం లేదు. దేశంలో రోజు ఎక్కడోచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. కుమారుడు ప్రేమించిన బాలికపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూర్ బాళే హెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.

RAPE

వివరాల్లోకి వెళితే..బాళే హెన్నూర్ పరిధిలో ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తన లవర్ ను కలిసేందుకు బాలిక అతని ఇంటికి వెళ్లింది. ఈనేపథ్యంలోనే బాలికపై కన్నేసిన బాలుడి తండ్రి తన కొడుకు బయటకి వెళ్లాడని..రావడానికి సమయం పడుతుందని తెలిపాడు. ఇంట్లోనే ఉండమని కోరాడు. సాయంత్రం కావడంతో బాలిక కూడా అక్కడే ఉంది. ఇదే అదనుగా భావించిన బాలుడి తండ్రి చంద్రు బాలికపై బలవంతంగా లైంగిక దాడికి తెగబడ్డాడు. అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లికి చెప్పుకుంది. దీంతో బాలిక తల్లి బాళే హెన్నూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై లైంగిక దాడి చేసిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news