దేశంలో ఎక్కడో ఓ చోట అత్యాచారాలు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు.. ఎన్ని చర్యలు తీసుకున్నా కామాంధుల అఘాయిత్యాలు తగ్గడం లేదు. వావీవరసలు, చిన్నపెద్ద, లింగ భేదాలు మరించి కామాంధులు ప్రవర్తిస్తున్నారు. తాజాగా మైలార్ దేవ్ పల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే.. బాలుడిపై అత్యాచారానికి తెగబడ్డాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పదేళ్ల బాలుడిపై 25 ఏళ్ల అరబిక్ టీచర్ అత్యాచారం చేశాడు. దారుల్ ఉలూమ్ మదర్సా టీచర్ షోయబ్ అక్తర్ అనే వ్యక్తిపై బాలుడి తలిదండ్రుల ఫిర్యాదులో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పదిరోజులుగా వరసగా బాలుడిపై అత్యాచారానికి తెగబడుతున్నాడు. రెండు నెలల క్రితమే దక్షిణాఫ్రికాలో ఉంటున్న బాలుడి కుటుంబం.. హైదరాబాద్ తిరిగి వచ్చారు. వెన్ను నొప్పి రావడంతో ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రలుకు అత్యాచారం గురించి తెలిపాడు. దీనిపై తల్లిదండ్రులు స్థానికులతో కలిసి మదర్సా ముందు నిరసన తెలిపారు. బాలుడిని వైద్యపరీక్షలు నిర్వహించారు పోలీసులు. అత్యాచారానికి పాల్పడ్డ అక్తర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.