తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. ఇటీవల సైదాబాద్ సింగరేణి కాలనీ లో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇటీవలే నల్గొండ జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. ఇక తాజాగా ఓ యువతికి మద్యం తాగించి ఆమెపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నలుగురు కామాందులు యువతిని బంధించి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి షాక్ లో ఉన్నట్టు తెలుస్తోంది. యువితికి ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తున్నారు. యువతి స్పృహలో లేదని స్పృహలోకి రాగానే వాంగ్మూలం తీసుకుంటామని చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నింధితులను పట్టుకునే పనిలో ఉన్నారు.