ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అవకాశాల వినియోగంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగవంతం కానుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేశ్.. శాన్ ఫ్రాన్సిస్కోలోని పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రతి వంద రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
పీ-4 విధానాల అమలుతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు.ఇటీవలే రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలాజీ విస్తరణకు డ్రోన్ షో నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సాంకేతికత విస్తరణ కోసం ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించడం సైతం జరిగిందని తెలిపారు.