జగన్ బెయిల్ రద్దు చేయించే కుట్రలకు షర్మిల తెర తీశారని… చంద్రబాబు పన్నాగం ప్రకారం షర్మిల నడుస్తున్నారని ఆగ్రహించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కడప రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆద్వర్యం లో సమావేశమయ్యారు రెండు జిల్లాల ముఖ్య నాయకులు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించామని.. జిల్లా, మండల స్థాయిలో పార్టీ కార్యవర్గాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి పార్టీ పోస్టుల్లో నియామకాలు చేస్తున్నామని ప్రకటించారు.
జగన్ హయంలో ఎపిఆర్సి సమావేశం అనగానే కరెంట్ బిల్లులు పెంపు అని మీడియాలో రాసేవారని… ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 6 వేల కోట్లు కరెంట్ చార్జీలు పెంచడానికి రంగం సిద్దం చేశారని పేర్కొన్నారు. మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టీ రైతులను ఆడుకుంటే…. నేడు క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా రైతులే కట్టుకోవాలని నిర్ణయించారని తెలిపారు. రైతు ఆత్మహత్యలు రోగం కారణంగా జరిగాయి అని గతంలో టిడిపి ప్రభుత్వం లో నాగం జనార్ధన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారన్నారు. అలాంటి వారికి ఏమైనా రైతులు పట్ల బాధ్యత ఉంటుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారు… కేసులో ఉన్న ఆస్తులు బదలాయింపు సాధారణంగా జరగదని తెలిపారు.