Asia Cip 2022 : ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మరో విజయాన్ని తన ఖాతాల్లో వేసుకుంది. తొలి మ్యాచ్ లోనే శ్రీలంక జట్టును చిత్తు చేసిన ఆఫ్ఘానిస్తాన్.. మంగళవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో కేవలం 127 పరుగులు చేయడంతో ఆఫ్ఘాన్ బ్యాటర్లు మొదటి నుంచి ఆచితూచి ఆడుతూ.. పరుగులు రాబట్టారు.
ఈ నేపథ్యంలోనే 9 బంతులు మిగిలి ఉండగానే.. 128 రన్స్ టార్గెట్ ను 7 వికెట్ల తేడాతో ఆప్థాన్ గెలుపొందింది. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ సందర్భంగా అఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ 20 క్రికెట్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. బంగ్లా తో జరిగిన మ్యాచ్ రషీద్ 3 వికెట్లు తీయడం ద్వారా అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. మొత్తం 68 మ్యాచ్ ల్లో 115 వికెట్లు తీసి.. న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీని అధిగమించాడు అఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.