నాపై ఎలాంటి బ్యాన్ విధించలేదు – రష్మిక

-

కన్నడ చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించిందన్న వార్తలను ఖండించిందు హీరోయిన్ రష్మిక. కన్నడ చిత్ర పరిశ్రమ నాపై ఎలాంటి నిషేధం విధించలేదని క్లారిటీ ఇచ్చింది రష్మిక. కాంతార చిత్ర విషయంలో నాపై కొంతమంది అత్యుత్సాహం చూపించారని ఫైర్ అయ్యారు.

కాంతార సినిమా చూసి చిత్ర బృందానికి మెసేజ్ పెట్టానని…నటీనటుల మధ్య ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదని పేర్కొన్నారు రష్మిక. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేనని ఆగ్రహించారు రష్మిక.

 

మెసేజ్ లు కూడా బయటికి రిలీజ్ చేయలేను…నా వ్యక్తిగత జీవితం ప్రజలకు అవసరం లేదన్నారు. వృత్తిగతంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రజలకు చెప్పడం నా బాధ్యత అన్నారు రష్మిక.

Read more RELATED
Recommended to you

Latest news