మరోసారి డీప్ ఫేక్ వీడియో పై స్పందించిన రష్మిక..!

-

నటి రష్మిక మందన సినిమాలతో బిజీగా ఉంది ఈ మధ్య యానిమల్ సినిమాలో నటించే బ్లాక్ బస్టర్ ని కొట్టేసింది ఈ సినిమా ఏకంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలని వసూలు చేసింది. రన్బీర్ ఈ సినిమాలో హీరోగా నటించగా సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్తో పుష్ప టు సినిమా షూటింగ్లో బిజీ అయింది ఈ సినిమాయే కాకుండా రష్మిక మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇటీవల రష్మిక డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో దుమారం రేపిన విషయం తెలిసిందే.

ఈ హీరోయిన్ తో పాటుగా ప్రియాంక చోప్రా ఇలా పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి ఈ వీడియోలపై పలు సెలబ్రిటీలతో పాటుగా రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. గుంటూరు కి చెందిన ఒక యువకుడ్ని కేసులో అరెస్ట్ చేశారు కూడా. నాలాంటి వాళ్ళు కొందరైనా డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడితే అవేర్నెస్ వస్తుందని రష్మిక చెప్పింది. ఈ విషయంపై ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఇలాంటివి కోరుకునే కదా ఇండస్ట్రీకి వచ్చారని అంటున్నారని రష్మిక అంది.

Read more RELATED
Recommended to you

Latest news