ఎంతో ప్రసిద్ధి గాంచిన రత్నం పెన్నుల గురించి అనేక విషయాలు మీకోసం…!

-

రత్నం పెన్నుల గురించి వినే ఉంటారు. ఇది నిన్నో మొన్నో వచ్చినది కాదు. ఈ కంపెనీ పెన్నులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రత్నం పెన్నుల తయారీకి పూర్తిగా స్వదేశీ వస్తువులను వాడటం ఈ పెన్నుల ప్రత్యేకత అని చెప్పవచ్చు. పూర్తిగా స్వదేశీ కావడం వల్లనే మన జాతిపిత మహాత్మా గాంధీ దానిని ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు అర్ధమయ్యే ఉంటుంది ఈ పెన్నుల కంపెనీ ఎప్పటి నుండి ఉందనేది.

ఈ రత్నం పెన్నులను మొట్ట మొదటి సారిగా మహాత్మా గాంధీ వాడినట్లు రత్నం పెన్నుల కంపెనీ చెబుతోంది. విదేశీ వసువులకి స్వస్తి చెప్పి స్వదేశీ వస్తువులకి శ్రీకారం చుట్టమని చెప్పిన గాంధీ గారి మాటలను స్ఫూర్తిగా తీసుకొని పూర్తి స్వదేశీ వస్తువుల తో ఈ పెన్ను తయారు చేసి స్వయంగా గాంధీజీ గారికి ఇచ్చినట్లు ఈ కంపెనీ వెల్లడించింది. 1932 వ సంవత్సరం లో మొట్ట మొదటి సారిగా కె.వి రత్నం పూర్తి స్వదేశీ వస్తువుల తో ఈ పెన్నులు తయారు చేయడం ప్రారంభించారు. ఇప్పటికీ ఈ పెన్నులకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.

గాంధీ గారు ఉపయోగించిన తర్వాత మన దేశ రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు వారి ప్రమాణ స్వీకారోత్సవం రోజున దీనినే ఉపయోగిస్తున్నారు. ఆ పెన్నుల విషయం లోకి వస్తే… “సుప్రీమ్” అనే ప్రత్యేకమైన మోడల్ ని ఈ కంపెనీ ప్రత్యేకించి తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కంపెనీ చేసే పెన్నులు ధర ఎలా ఉంటుందంటే..? 300 రూపాయల నుంచి 2.5 లక్షల వరకు ఈ పెన్నులు అందుబాటు లో ఉంటాయి. చాలా మోడల్స్ కూడా వీళ్ళు తయారు జేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news