అంకులు హత్య పోలీసుల పనే.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఫ్యాక్షన్ నేత సీఎం ఐతే రాష్ట్రం ఇలాగే ఉంటుందని ఏపీ టీడీపీ నేత నారా లోకేష్ పేర్కొన్నారు. అంకులు హత్యలో స్థానిక SI బలనాగిరెడ్డి, ఎమ్మెల్యే కాసు భాగస్వామ్యం ఉందని ఆయన అన్నారు. ఇప్పటికి నలుగురు కార్యకర్తలను ఈ ప్రాంతం లో హత్య చేశారన్న ఆయన బ్ ఇన్స్పెక్టర్ పేరు FIR లో పెట్టాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల వ్యక్తులపై దాడులు జరుగుతున్నాయన్న లోకేష్ పులివెందులలో దళిత మహిళ ను కిరాతకంగా హత్య చేశారని అన్నారు.

గ్రామస్థులతో మీటింగ్ లో ఎమ్మెల్యే కాసు స్కెచ్ వేశారని లోకేష్ ఆరోపించారు. అంకులు ఫోన్ ఏమయ్యింది….ఎందుకు వాస్తవాలు చెప్పడం లేదు ? అని అయన ప్రశ్నించారు. SI పిలిస్తేనే అంకులు ఇంటి నుండి వెళ్లారన్న ఆయన జగన్ రెడ్డి ఏపీ అంటే ఇడుపుల పాయ కాదు…ఒక్కొక్కరిని చంపితే బయపడిపోమని అన్నారు. ఇంకో ఘటన జరిగితే…తదుపరి ఘటనలకు సీఎం బాధ్యత వాహించాల్సి ఉంటుందని లోకేష్ అన్నారు.