Raveena Tandon: ఆ కారణాల వల్లే మాస్‌ ఆడియన్స్‌కు బాలీవుడ్ దూరం..రవీనా టండన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

బీ టౌన్ సీనియర్ నటి ప్రస్తుతం KGF2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తు్న్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల నుంచి చక్కటి గుర్తింపు పొందారు. శక్తిమంతమైన నాయకురాలి పాత్రలో పిక్చర్ లో రవీనా కనిపించింది. తాజాగా ఈమె సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూనే బాలీవుడ్ ఇండస్ట్రీపైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొంది. అయితే, బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్‌ను అనుకరిస్తూ మాస్‌ ఆడియన్స్ కు దూరమవుతున్నాయని వివరించింది నటి రవీనా టండన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇండియన్ కల్చర్ క్రమంగా తగ్గుతూ వచ్చిందని, అలా సినిమాలు ఆడియన్స్ కు దగ్గర కావడం లేదని అభిప్రాయపడింది.

తాను బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లో నటించానని, అక్కడి సినిమాలు సంస్కృతి సంప్రదాయాలకు దగ్గరగా ఉంటాయని వివరించింది. ప్రశాంత్ నీల్ – యశ్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ టూ పిక్చర్ అంచనాలను మించిపోతున్నది.

ఈ చిత్రంలో బాలీవుడ్ సెలబ్రిటీ రవీనా టండన్ ‘రమీకా సేన్’ అనే పాత్ర పోషించగా, ‘అధిర’గా సంజయ్ దత్ నటించారు. తెలుగు చిత్ర సీమ నుంచి రావు రమేశ్ కీలక పాత్ర పోషించారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా కీ రోల్ ప్లే చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version