బీఆర్ఎస్ నాయకుడు రావెల కిషోర్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ హోదా రద్దు కాలేదు…వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏపీలో ఎన్నికల బరి లో ఉంటుందని తెలిపారు. ప్రైవేటీకరణ పేరుతో బిజేపి ప్రజలను దోచుకుంటుంది…ఆధాని లాంటి వాళ్లకి పల్లకి లు మోస్తూ అంబెడ్కర్ ఆశయాలను కుంగ తొక్కుతున్నారని ఆగ్రహించారు.
రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ లో ఈ నెల 14 న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారన్నారు.అంబేద్కర్ మనుమడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి…దళితుల పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు కేసిఆర్ అని కొనియాడారు. 650 కోట్ల రూపాయల తో హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షనీయమన్నారు. కులమతాలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహ అవిష్కరణ సభకి ప్రజలు తరలి రావాలని కోరారు రావెల కిషోర్ బాబు.