గత రెండు రోజుల క్రితం టీమిండియా ఆటగాడు అశ్విన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ కోచ్ రవి శాస్త్రి కౌంటర్ ఇచ్చాడు. తను ఒక కోచ్ నని అందరినీ సంతృప్తి పరిచే వ్యక్తిని కాదని అన్నారు. వాస్తవాలు చెప్పడమే తన పని అని అన్నారు. అలాగే తను చేసిన వ్యాఖ్యలు మరొకరిని బాధిస్తే తనకు సంతోషమే అని అన్నారు. అయితే 2019 లో ఆస్ట్రేలియా తో సిడ్నిలో జరిగిన టెస్టు మ్యాచ్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీశాడు. దీంతో అప్పుడు కోచ్ గా ఉన్న రవి శాస్త్రి కుల్దీప్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. విదేశాల్లో బెస్ట్ స్పిన్నర్ కుల్దీప్ అని అన్నాడు.
అయితే ఈ వ్యాఖ్యల పై అశ్విన్ ఇటీవల స్పందించాడు. ఆ వ్యాఖ్యలు తనను బస్సు కిందకు తోసేసినట్టు అనిపించిందని అన్నారు. అయితే రవి శాస్త్రీ ఈ వ్యాఖ్యలకు కౌంటర్ వేశాడు. సిడ్ని మ్యాచ్ లో అశ్విన్ ఆడలేదని.. కుల్దీప్ బాడా ఆడాడని అందుకే అలా అన్నానని అన్నారు. తను అందరినీ సంతృప్తి పరిచే వ్యక్తిని కాదని కోచ్ నని అన్నారు. అలాగే అశ్విన్ ను బస్సు కిందకు తోసేసినట్టు ఫీల్ కావడం అవసరం లేదని అన్నారు. తను బస్సు డ్రైవర్ కు చెప్పానని ముందుగానే బస్సును ఆపాలని అని వ్యాగ్యంగా కౌంటర్ వేశాడు.