త్వ‌ర‌లోనే హ‌రీష్ రావును టీఆర్ఎస్ నుంచి బ‌యట‌కు పంపుతారు : రవీందర్ సింగ్

-

క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్, ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ మ‌రోసారి…టీఆర్ ఎస్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి హరీష్ రావు టీంలో ఎవ్వరికి పదవులు ఇవ్వలేదని.. అందుకే త్వరలో హరీష్ రావును కూడా బయటకు పంపుతారని పేర్కొన్నారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికలో సిద్దిపేట జిల్లా 4 మండలాలు ఉన్నాయని..2006 లో ఎన్నికల సమయంలో రాజీవ్ రహదారి ని అప్పటిలో నిర్బంధించామ‌న్నారు.

హరీష్ రావు ను నమ్ముకున్న నాకు, సాయిచంద్ ,ఎర్రోల శ్రీనివాస్ అంత హరీష్ రావు సభ్యులుగా ముద్ర పడింది, కానీ మాలో ఎవరికి ఎమ్మెల్సీ టికెట్ రాలేదన్నారు. నేను నామినేషన్ వేసాను కాబట్టి ఇప్పుడు ఎన్నికలు జరుగుతూనాయ్, లేక పోతే జరిగే వి కావన్నారు. మేము ఉద్యమం లో దెబ్బలు తింటే, వేరే వాళ్ళు పదవులు లో ఉండి డబ్బులు సంపాదిస్తున్నారని నిప్పులు చెరిగారు.

ఎర్రబెల్లి, మల్లారెడ్డి, పువ్వాడ, కుశిక్ రెడ్డి ఎంతో మంది తెలంగాణ ఉద్యమం లో మాకు వ్యతిరేకంగా ఉండి మమ్మల్ని ఎంతో ఇబ్బందులు గురి చేసి ఇప్పుడు పెద్ద పెద్ద పదవులు ఆశిస్తున్నారని ఆగ్ర‌హించారు. స్థానిక ప్రజాప్రతినిధులు అందరిని భానుప్రసాద్ విహార యాత్రలు తీసుకువెళ్లాడని, ఎందుకు పని చేయని వ్యక్తిని ఎందుకు ఎన్నుకుంటున్నారు మీరు ఆలోచించండని కోరారు. ఇవ్వాళ స్థానిక ప్రజాప్రతినిధులు నా వల్లే మీరు ఇవ్వాళ విహార యాత్రలు, తీసుకువెళ్లారు. మొన్న జరిగిన హుజురాబాద్ ఎన్నికలో భారీగా డబ్బులు పంచిన టీఆర్ఎస్ ఓటమి చూసింది.ఇప్పుడు రాష్ట్రం మొత్తం కరీంనగర్ వైపు చూస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news