తమిళనాడు గవర్నర్ గా మాజీ కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రి పదవికి రవి శంకర్ ప్రసాద్ రాజీనామా చేశారు. మొన్నటి వరకు ఐటీ శాఖ మరియు న్యాయశాఖ మంత్రిగా రవిశంకర్ ప్రసాద్ బాధ్యతలు నిర్వర్తించారు.
ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముందు ఆయన తన పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో నే కేంద్ర ప్రభుత్వం ఆయనను తమిళనాడు గవర్నర్ గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా బన్వర్ లాల్ పురోహిత్ వ్యవహరిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా 4 రోజుల క్రితం 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించిన సంగతి తెలిసిందే. అందులో ఏపీకి చెందిన కంభంపాటి హరి బాబును మిజోరం గవర్నర్ గా నియమించగా…. బండారు దత్తాత్రేయ ను హర్యానా గవర్నర్ గా నియామకం చేశారు.