Ravi Teja: మాస్ మహారాజా “ధ‌మాకా”.. ఫస్ట్ లుక్ రిలీజ్

-

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ .. వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోల‌కు పోటీగా నిలుస్తున్నారు. ఇండ‌స్ట్రీలో దూసుకపోతున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్’ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్ట‌డంతో వెనువెంట‌నే.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ అనే సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో రవితేజ డూయ‌ల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తున్నారు.


మాస్ మ‌హారాజ్ కు త‌గ్గ‌ట్టుగా రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి శరత్ మందవా అనే దర్శకుడి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అస‌లు త‌గ్గేదే లేద‌న్న‌ట్టుగా మ‌రో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ‘సినిమా చూపిస్తా మావ‌’, ‘నేను లోక‌ల్’ వంటి హిట్ చిత్రాల ద‌ర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో ర‌వితేజ 69 వ చిత్రాన్ని చేస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వ‌చ్చింది. ఈ మూవీకి ధ‌మాకా అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు నేడు అఫీషియ‌ల్‌గా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందట. న‌టీన‌టుల పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news