జెర్సీ దర్శకుడితో చరణ్ …. ఇట్స్ అఫిషియల్..!

-

మళ్లీ రావా సినిమాతో టాలీవుడ్ లో సత్తా చాటిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా విజయం తర్వాత గౌతమ్ తిన్ననూరి నాని హీరోగా జెర్సీ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా మంచి విజయం సాధించింది. స్పోర్ట్స్… ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశంసలతో పాటు అవార్డుల పంట కురిసింది. ఏకంగా జెర్సీ సినిమా కు నేషనల్ అవార్డు రావడం తో దర్శకుడి క్రేజ్ మరింత పెరిగింది.

ఇక ప్రస్తుతం ఈ సినిమాని బాలీవుడ్ లో సైతం రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ కాంబో లో ఓ సినిమా తెరకెక్కబోతుంది అని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా పై అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమా ను భారీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా కూడా స్పోర్ట్స్ డ్రామా గా ఉండబోతుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు లవ్ స్టొరీ అని కూడా టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news