రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పచ్చి మామిడి కాయ ఉపయోగ పడుతుంది. ఇది నీటి శాతాన్ని కూడా పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ కరోనా సమయం లో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పచ్చిమామిడి కాయలు తీసుకోండి.
పచ్చి మామిడి కాయ లో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి అదే విధంగా క్యాల్షియం, ఫాస్పరస్, ఫైబర్ కూడా దీని ద్వారా మనకి లభిస్తుంది.
పచ్చి మామిడికాయను తీసుకోవడం వల్ల కలిగే లాభాలు:
రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇటువంటి కరోనా సమయం లో ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవాలి. షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవడానికి కూడా పచ్చి మామిడి కాయ బాగా ఉపయోగ పడుతుంది. అంతే కాదండి ఐరన్ కూడా మనకి వస్తుంది.
ఎసిడిటి సమస్యల తో బాధ పడే వారు పచ్చి మామిడికాయ ముక్కల మీద బ్లాక్ సాల్ట్ వేసుకుని తీసుకుంటే గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది ప్రతి రోజూ 100 నుండి 150 గ్రాముల వరకు పచ్చి మామిడి కాయను తీసుకోవచ్చు. దీనితో ఈ సమస్యలు ఏమి వుండవు.