వ‌డ్డీ రేట్ల‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం..!

-

ఆర్బీఐ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన స‌మీక్షపై ర‌క‌రాల చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ సారి కూడా కీల‌క వ‌డ్డీరేట్ల‌ను ఆర్బీఐ త‌గ్గిస్తుంద‌ని ఆర్థిక నిపుణులు అంచ‌నా వేశారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్. అయితే ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

rbi-governor
rbi-governor

ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్… కీలక వడ్డీ రేట్లను ఈసారి యథాతథంగానే కొన‌సాగిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మంచి వర్షాలు, ఖరీఫ్ విత్తనాల విస్తీర్ణంతో వ్యవసాయ రంగ అవకాశాలు మెరుగుపడినట్లు చెప్పుకొచ్చారు. బ్యాంకు రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. వీటి రేటు 4.25 శాతంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరుసగా నాలుగో నెల మర్చంటైజ్డ్ ఎగుమతులు క్షీణించాయని శక్తికాంత దాస్ ఈ సందర్బంగా తెలిపారు.

అయితే 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ద్రవ్యోల్భణం పెరిగే అవకాశము ఉందని తెలిపారు. అవసరమైతే తగిన సందర్భంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచీ ఆర్‌బీఐ రెపో రేటులో 1.15 శాతంమేర కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో తాజా రుణాలపై దేశీ బ్యాంకులు సైతం 0.72-0.8 శాతం మధ్య వడ్డీ రేట్లను తగ్గించాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నారు.

అంతేకాకుండా మరోవైపు పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అమెరికాలో వడ్డీ రేట్లు దాదాపు జీరోకు చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన వద్ద కూడా వడ్డీ రేట్లను మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కొనసాగింది. ఇప్పటికే భారీగా తగ్గాయి. మరింతగా తగ్గిస్తే బ్యాంకింగ్ వ్యవస్థపై పడే ప్రభావాన్ని కూడా నిపుణులు పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.

దీంతో ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రెపో తగ్గింపు రేటు సరికాదని అధికారులు భావించారు. దీంతో ఆ మేరకు వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు గత ఎంపీసీ సమావేశాల్లో రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించిందని తెలిపారు. అయితే గత ఏడాది ఫిబ్రవరి నుండి మొత్తం 250 బేసిస్ పాయింట్లు తగ్గాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news