మెగాస్టార్ చిరంజీవి ఇంట క్రిస్ మస్ రోజున మరో ఫ్యామిలీ మెంబర్ జాయిన్ అయ్యాడు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ లకు పండంటి ఆడపిల్ల పుట్టిందట. ఈ విషయాన్ని కళ్యాన్ దేవ్ వెళ్లడించడం జరిగింది. క్రిస్ మస్ రోజున మెగా ఫ్యామిలీకి డబుల్ హ్యాపీస్ అని చెప్పొచ్చు. సో మరోసారి చిరంజీవి తాత అయ్యాడన్నమాట.
తాతయ్య చిరంజీవి పిలిచేందుకు బాగాలేకున్నా ఈ వయసులో కూడా యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. ఇక మెగా హ్రోల లిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరి దారిలో వారు దూసుకెళ్తున్నారు. ఈమధ్యనే కళ్యాణ్ దేవ్ కూడా విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.