బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు సార్లు సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న ఆర్బీఐ మరోసారి సరికొత్త సూచనలు జారీ చేశారు. ప్రపంచంలో ఎప్పుడు లేని విధంగా సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. బ్యాంక్ కస్టమర్లు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.
అయితే ఏ బ్యాంక్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్, ఇమెయిల్, ఎస్ఎంఎస్, వెబ్-లింక్ వచ్చిన వాటికి స్పందించవద్దని తెలిపింది. అలాగే బ్యాంక్ వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలను అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని ఆర్‌బిఐ సోషల్ మీడియాలో సందేశం జారీ చేసింది. మీకు ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే మీ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి కస్టమర్ సపోర్ట్ నంబర్‌ను వెతికి వారికి సమాచారం అందించాలని తెలిపింది. ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది .
అంతేకాకుండా సైబర్ మోసం చిటికెలో జరిగిపోతుందని ఆర్బిఐ తెలిపింది. కార్డు వివరాలు, బ్యాంక్ ఖాతా, ఆధార్, పాన్ వంటి మీ వ్యక్తిగత సమాచారం గురించి ఎవరికీ చెప్పకూడదని ఆర్బీఐ సూచించింది మీకు తెలియని నంబర్ నుండి కాల్ వస్తే లేదా ఎవరైనా మిమ్మల్ని బ్యాంక్ అకౌంట్ నంబర్ అడిగినా లేదా మీ నుండి కెవైసి సమాచారం కావాలనుకుంటే, మీరు వెంటనే ఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేయాలంటూ ఆర్బీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు.
అంతేకాక గత 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1,48,428 కోట్ల రూపాయల సైబర్ మోసాలు జరిగాయన్నారు. అవన్నీ ప్రభుత్వ రంగంలోని 18 బ్యాంకులలో నమోదయ్యాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో, ఇలాంటి సైబర్ మోసాల బాధిత బ్యాంక్ ఎస్బిఐ. గతేడాది కాలంలో రూ .44,612.93 కోట్ల మోసానికి పాల్పడిన 6,964 కేసులు ఎస్‌బిఐకి బ్యాంక్ కస్టమర్లకు సంబంధించినవే. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో 18 ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల్లో జరిగిన మొత్తం మోసాలలో 30 శాతం ఉందని తెలిపారు.