RC Renewal: RC రెన్యువల్‌ చేసుకోవాలా..? ఆన్‌లైన్‌లో ఈజీగా మీ వెహికల్‌ RC రెన్యువల్‌ చేసుకోండి..!

-

RC Renewal: వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గడువు 15 ఏళ్ల పాటు ఉంటుంది. మోటార్ వెహికల్ చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ గడువు 15 సంవత్సరాల దాకా ఉంటుంది. తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకి రెన్యువల్ చేసుకోవాలి. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండడానికి ముగింపు తేదీకి ముందే రెన్యువల్ చేసుకోవాలి. అయితే ఆన్లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. RC రెన్యువల్ ప్రక్రియలో కొన్ని డాక్యుమెంట్లు చాలా ముఖ్యం. ఫారం 25 దరఖాస్తు ఫామ్, పొల్యూషన్స్ సర్టిఫికెట్, ఆర్సి బుక్, ఫిట్నెస్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అలాగే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, పాన్ కార్డ్ ఇలా డాక్యుమెంట్స్ అవసరమవుతాయి.

వాహన రిజర్వేషన్ సర్టిఫికెట్ ముగిసే 60 రోజులు ముందుగానే ఫారం 25 ను సంబంధిత అధికారులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకునే సమయానికి వాహనానికి సంబంధించిన టాక్స్లను చెల్లించాలి. దీంతో పాటుగా రెన్యువల్ ఫీజు ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ ఆన్లైన్ సేవలను క్లిక్ చేయాలి. వాహన సంబంధిత సేవలు ఎంపిక చేసుకుని రాష్ట్రాన్ని ఎంచుకుని ఆర్టీవో ను ఎంచుకుని ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి.

సేవలు యొక్క డ్రాప్ డౌన్ జాబితా నుంచి మీరు ఆర్సి సంబంధిత సేవల్ని సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ రెన్యువల్ ని ఎంచుకోండి. వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, చాసిస్ నెంబర్ ను ఎంటర్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి వివరాలను ధ్రువీకరించు ఆప్షన్ పైన నొక్కాలి. ఇలా మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. లేదంటే మీరు ఆఫ్ లైన్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news