CM Revanth will go to Delhi again today: నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఇటీవలే అమెరికా వెళ్లి వచ్చిన సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీకి పయనం కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…ఇవాళ ఢిల్లీకి పయనం కాబోతున్నారు.
ఈ సందర్భంగా నామినేటెట్ పోస్టులు, పార్టీ పదవుల అంశం పై చర్చ ఉండే అవకాశాలు ఉన్నాయట. రుణమాఫీ సభకు రావాలని అధిష్టానంను ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
ఇక అటు AICC పిలుపు మేరకు అదానీకి వ్యతిరేకంగా నిరసన తెలపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుంచి ఈడి కార్యాలయం వరకు భారీ ప్రదర్శన, ఈడి కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించనున్నారు.