బడ్జెట్ పై మంత్రి హరీష్ రావుకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. 7 ఏళ్ల బడ్జెట్ పై చర్చకు సిద్ధామని హరీష్ రావుకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. హరీష్ రావుకు అసలు బడ్జెట్ రూప కల్పన అవగాహాన ఉందా అని ప్రశ్నించారు. అలాగే బడ్జెట్ పై ఆర్థిక మంత్రితో సమీక్ష చేసే విధానాన్ని సీఎం కేసీఆర్.. ఎత్తేశారని విమర్శించారు. అలాగే తనకు బడ్జెట్ పై అనుభవం ఉందని, దానిలోని లోసుగులు అన్నీ తెలుసు అనే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు.
కాగ 2014లో రాష్ట్రానికి అప్పు కేవలం.. రూ. 79 వేల కోట్లు మాత్రమే ఉండేదని అన్నారు. కానీ ప్రస్తుతం ఆ అప్పును 3,29,988 కి చేర్చారని విమర్శించారు. కాగ కేసీఆర్ సర్కార్.. శాసన సభ్యుల హక్కులను హరిస్తుందని ఆరోపించారు. తమ సీట్లలో నిల్చుని ఆందోళన చేస్తే.. ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు.
శాసన సభ్యుల హక్కులను కేసీఆర్ సర్కార్ కాలరాస్తే.. స్పీకర్ సైలెంట్ గా ఉన్నాడని విమర్శించారు. అలాగే ఈ బడ్జెట్ మోసపూరితమైందని విమర్శించారు. నీతి ఆయోగ్ నిధులు కేంద్రం ఇవ్వలేదని చెప్పి.. బడ్జెట్ లో మాత్రం పెట్టారని అన్నారు.