ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతిపై దాడి..కారణం ఇదే..!

రెండు రోజుల క్రితం బెంగుళూరు విమానాశ్రయంలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి పై ఓ వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి ఎయిర్ పోర్ట్ లోకి వెళ్తుండగా ఓ వ్యక్తి సడన్ గా వచ్చి వెనక నుండి తన్నాడు. దాంతో వెంటనే అప్రమత్తమైన అతడి సెక్యూరిటీ ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. ఇక ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు కేరళ కు చెందిన జాన్సన్ గా గుర్తించారు. అతడు బెంగళూరులో ఉద్యోగం నిమిత్తం ఉంటున్నట్టు విచారణలో వెల్లడైంది.

అయితే విజయ్ సేతుపతి పై దాడికి గల కారణాలను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. ఎయిర్ పోర్ట్ లోకి వస్తున్న సందర్భంలో అతడు విజయ్ సేతుపతి ని సెల్ఫీ ఇవ్వాలని కోరాడట అయితే సేతుపతి పక్కన ఉన్న బాడీగార్డులు అతన్ని పక్కకు తోసారట దాంతో కోపంతో ఊగిపోయిన జాన్సన్ పరిగెత్తుకుంటూ వచ్చి విజయ్ సేతుపతి పై దాడి చేశాడు. అంతేకాకుండా ఆ సమయంలో జాన్సన్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.