సాయి పల్లవికి కాకుండా పూజా హెగ్డే కి అవార్డు ఇవ్వడం వెనక కారణం..?

-

తాజాగా బెంగళూరులో జరిగిన సైమా 10వ వార్షికోత్సవానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అంతేకాదు వారు సైమా అవార్డులను కూడా సొంతం చేసుకోవడం జరిగింది. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి హాజరైన బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఏకంగా 2 సైమా అవార్డులను సొంతం చేసుకుంది. ఈ విషయంతో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైందని చెప్పవచ్చు. ఇకపోతే 2021 కి గానూ సైమా నిర్వహించిన అవార్డ్ ఫంక్షన్లో పూజా హెగ్డే కి బెస్ట్ హీరోయిన్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి గాను ఒకటి, మరొకటి యూత్ ఐకాన్ అవార్డు రావడం.. ఇలా రెండు అవార్డులు లభించడంతో ఆమె వాటిని చూసుకొని మురిసిపోతూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసుకుంది.

దీంతో ఈమెపై పూర్తిగా ట్రోలింగ్ జరుగుతూ ఉండడం గమనార్హం. ఎందుకంటే 2021 కి గాను బెస్ట్ హీరోయిన్ క్యాటగిరిలో సాయి పల్లవి లవ్ స్టోరీ , శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో నామినేట్ అయ్యింది. ఈ రెండు సినిమాలలో కూడా అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో పూజా హెగ్డే ఒక సాధారణ యువతిగానే కనిపించింది. ఆమె అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది లేదు.. అలాంటిది సాయి పల్లవి కే కాకుండా పూజా హెగ్డే కి అవార్డులు ఇవ్వడం ఏంటి అంటూ కొంతమంది నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన కొంతమంది పూజా హెగ్డే అవార్డును డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు..

ఇక అసలు విషయం ఏమిటంటే.. నెటిజన్ లు ఇలా ఆర్గ్యూ చేయడంలో తప్పులేదు.. కానీ పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లు అవార్డు ఫంక్షన్లకు వస్తే వేడుకకు బాగా పబ్లిసిటీ పెరుగుతుంది అని సంస్థలు ఇలా భావించి.. వారికి అవార్డ్ లు ఇచ్చి ఉండవచ్చు కదా అని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని పోయి పూజా హెగ్డే ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ గా లేదు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news