సాధారణంగా మనం గమనిస్తే వివాహాలు జరిగినప్పుడు కానుకగా డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు కూడా 116, 516, 1,116 ఇలా ఇస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మీకు సందేహం కలిగినా ఎందుకు చివరన 16 సంఖ్య వచ్చేలా చూసుకుంటారు అని… అయితే ఈ రోజు ఎందుకు అలా ఇస్తారు అనే దాని గురించి చూద్దాం. మరి ఆలస్యమెందుకు దీని కోసమే పూర్తిగా చూసేయండి.
ఎప్పటి నుండో 116, 516, 1,116 పూర్వికులు ఇస్తుండేవారు. తమ పెద్దలు అలా ఇచ్చేవారు కాబట్టి తాము కూడా అలానే ఇవ్వాలని ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఈ సంప్రదాయం నిన్న మొన్నటిది కాదు తరతరాలుగా ఇదే కొనసాగుతోంది. మామూలుగా సున్నా చివర ఉన్న సంఖ్య తో డబ్బులు ఇవ్వరు. అయితే కనీసం ఒకటి లేదా రెండు ఉండేటట్టు ఇవ్వచ్చు కదా మరి 16 ఎందుకు చూసుకుంటారు అనేది చూస్తే…
గతంలో బ్రిటిష్ వారి పాలనలో ఉన్న సమయంలో వంద రూపాయలు మార్చుకుంటే పదహారు రూపాయలు తక్కువగా ఇచ్చేవారట. ఆ తర్వాత తక్కువ అయిపోయిన పదహారు రూపాయలు కూడా కలిపి ఇచ్చేవారట. ఇది ఆచారంగా మారింది. చివరకు 116, 516, 1,116 రూపాయలు గా మారింది.
నిజాం సంస్థానం ఉన్న రోజుల్లో వారి లెక్కలు మరియు ఆంధ్రప్రాంతం వారి లెక్కలు వేరుగా ఉండేవట. ఈక్రమంలో నిజాం ప్రాంతంవారు ఆంధ్ర ప్రజలకు చెల్లింపులు చెల్లించేటప్పుడు వందకి 116 చెల్లిస్తేనే సమానం అయ్యేది. దీనికి గల కారణం నిజాం వాసులు వాడే రూపాయి మారకం విలువ తక్కువగా ఉండేది. అందుకని వంద రూపాయలు చెల్లించాలంటే 116 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఇలా ఇది సాంప్రదాయంగా మారింది ఇప్పటికీ కూడా అంత దీన్ని ఆనవాయితీగా ఫాలో అవుతున్నారు.