గణేష్ నిమజ్జనం నేపథ్యంలో రాచకొండ పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 24 ప్రాంతాల్లో నిమ్మజ్జనం నిర్వహిస్తున్నామని.. 6500 కు పైగా విగ్రహాలు కమిషనరేట్ పరిధిలో అనుమతితో ఉన్నాయి.. పది వేలకు పైగా నిమ్మజ్జనం అవుతాయని పోలీసులు ప్రకటించారు. రూట్ క్లియర్ ఎప్పటికప్పుడు చేసేలా చర్యలు చేపడుతున్నామని.. 5000 మంది కమిషనరేట్ సిబ్బందితో బందిబస్తు మరో వెయ్యి మంది తో ఎమర్జన్సీ టీమ్ లను సిద్ధంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. ‘
గ్రామీణ ప్రాంతాల్లోని వారు గ్రామాల్లో ఉన్న లేక్ ల వద్ద నిమజ్జనం చేస్తామని.. స్విమ్మర్లు, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుతున్నామని వెల్లడించారు. కోవిడ్ థార్డ్ వేవ్ ఉందన్న విషయం ప్రజలు గుర్తుంచుకోవాలని.. ఐసీఎంఆర్ నిబంధనలను పాటించాలి.. సామాజిక భద్రత, స్యానిటైజర్లను వాడాలని సూచనలు చేశారు. సోషల్ మీడియాలో ఇబ్బందికర పోస్ట్ లు పెట్టె వారి పై ఐటీ వింగ్, సైబర్ క్రైం టీమ్ నిఘా ఉంచుతోందని.. ఈవ్ టీజర్లను అరికట్టడానికి షీ టీమ్స్ ఉన్నాయని స్పష్టం చేశారు. బాలాపూర్ గణనాథుడిని సాధ్యమైనంత తొందరగా తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.