Keerthy Suresh: లిక్ లాక్ వ‌ద్దంటున్న మ‌హాన‌టి ?

-

Keerthy Suresh: మహానటి సినిమా కీర్తి సురేశ్‌ను ఓవర్ నైట్‌ స్టార్‌ హీరోయిన్‌గా మార్చింది. వ‌రుస ఆఫ‌ర్స్ బిజీబిజీగా మారింది. ఈ న‌టి ఎక్కువ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కే అధిక ప్రాధ్యాత‌న ఇస్తోంది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ లాంటి చిత్రాల్లో న‌టించింది. అయితే.. వీటిలో పెంగ్విన్, మిస్ ఇండియా నిరాశ‌ప‌ర‌చ‌డంతో ఎలాగైనా.. గుడ్ ల‌ఖ్ స‌ఖితో మెప్పించాలని భావిస్తుంది. ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కానున్న‌ది.

ఈ త‌రుణం సినిమాలు పెద్ద‌గా క‌లిసిరాక‌పోవ‌డంతో హీరోయిన్ రోల్స్ కు ఎక్కువగా ప్రాధాన్య‌త ఉన్నా.. సినిమాల‌కు ఒకే చెప్పింది . ఈ క్ర‌మంలోనే సర్కారు వారి పాటలో మహేష్ బాబు సరసన నటిస్తోంది.
అలాగే చిరు భోళా శంక‌ర్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అలాగే నాని దసరా మూవీలో
హీరోయిన్ న‌టించేందుకు డేట్స్ కేటాయించింది. ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మించబోతున్న ప్యాన్ ఇండియా మూవీలోనూ హీరోయిన్ గా నటించాలనుకుంటోందట. ఇలా క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ కు ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్.. కొన్ని విషయాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న‌ట్టు తెలుస్తోంద‌ట‌. మ‌రి ముఖ్యంగా తాను నటించే చిత్రాల్లో లిప్లాక్ స‌న్నివేశాలను మాత్రం ససేమిరా అన్నట్టు గా కూడా టాలీవుడ్ వర్గాల టాక్. గ‌తంతో అలాంటి సన్నివేశాలు చేసేట‌ప్పుడూ చాలా ఇబ్బంది ప‌డిన‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల ఓ స్టార్ హీరోతో అలాంటి లిప్ లాక్ సన్నివేశాలు ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కీర్తి సురేష్ భారీగా డిమాండ్ చేసిన నేపథ్యంలో లిప్ లాక్ సన్నివేశం ఉంటే మాత్రం ఎక్కువగానే ఖర్చు పెడతానని నిర్మాతలు చెప్పారు అని అంటున్నారు. మ‌రి భ‌విష్య‌తులో ఎలాంటి సినిమాలు చేస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news