ఆ వ్యక్తికి ఉందో వింతరోగం.. ప్రతి 6గంటలకు ఓసారి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా..!

-

మీ అందరికి గజిని సినిమా గుర్తు ఉండి ఉంటుంది కదా ..అందులో హీరో ప్రతిపావుగంటకు మర్చిపోతుంటాడు..ఒకవేళ ఇలా బయట కూడా జరిగే పరిస్థితి ఏంటంటారు. అసలు మనుషులు ఎవరూ గుర్తుకుండరు. పేరేంటో తెలియదు, ఏ ఊరో తెలియదు, జీవితం అంతా శూన్యం అయిపోతుంది అనుకుంటారు..కానీ నిజంగానే ఒక వ్యక్తికి ప్రతి 6గంటలకు ఓసారి మొత్తం మర్చిపోతుండాట. అంటే..ఆరుగంటల తర్వాత ఏం గుర్తుకుఉండదు.మళ్లీ కథ మొదటినుంచే స్టాట్ అన్నట్లు. అయినా తను చాలా హ్యాపీగా ఉన్నాడట. అసలు అతని జీవితం ఎలా సాగుతుందో, ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం

6 గంటలకు ఓసారి రిపీట్:

6 గంటలకు ఓసారి మర్చిపోవడం అంటే… రోజులో అతను 4సార్లు అన్నీ మర్చిపోతాడు కదా.. అంటే అతనికి రోజూ 4 సార్లు నువ్వు ఇది, నీ పేరు ఇది, నువ్వు ఇలాంటి వాడివి, ఇది చేస్తావు… అని అన్నీ గుర్తు చెయ్యాలి. ఇలా అతను తన గురించి తాను తెలుసుకొని అవునా… నేను ఇదా… అని గ్రహించేలోపు 6 గంటలు అయిపోతుంది మళ్లీ అన్నీ మర్చిపోతాడు. మళ్లీ సేమ్ సీన్ రిపీట్. తలచుకుంటేనే… భయంకరంగా ఉంది కదా. అతని పేరు డేనియల్ షుమిట్ . ఆరేళ్ల కిందట అతనికి ఓ కారు ప్రమాదం జరిగింది. దాంతో బ్రెయిన్ దెబ్బతింది.

డైరీయే ఆధారం:

గజిని మూవిలో హీరో సూర్య ఎలాగైతే… తాను కలిసినవాళ్లను ఫొటోలు తీసుకొని, పేర్లు రాసుకుంటాడో… అదే విధంగా డేనియల్ కూడా తాను ఎవర్ని కలిసినా ఓ డైరీలో పేర్లు, ఫోన్ నంబర్లు రాసుకుంటాడు. ఏ ప్రదేశానికి వెళ్లినా ఇలానే రాసుకుంటాడు. హైలెట్ ఏంటంటే..6 గంటల తర్వాత తాను అలా రాసుకున్న విషయం కూడా అతనికి తెలియదు. ఒక్కోసారి చుట్టూ చూసుకున్నప్పుడు డైరీ ఓపెన్ చేయడం ద్వారా తన సమస్య తనకు తెలుస్తుంది. తద్వారా గతం గుర్తు చేసుకుంటాడు. కానీ గుర్తుకు రావు.ఇతనిపై లివింగ్ వితౌట్ మెమరీ అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. ద్వారా మీరు ఈ డాక్యుమెంటరీ చూడొచ్చు.

యాక్సిడెంట్ రోజు ఏం జరిగింది?

అది 2015 ఫిబ్రవరి 14. ఆ రోజు డేనియల్ తన సోదరిని కలిసేందుకు కారులో వెళ్తున్నాడు. ఆరోజు ఏం జరిగిందో తనేం చెప్పాడంటే.. “నేను మోటర్ వేలో ఉన్నాను. అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది. నేను అందరికంటే చివర్లో ఉన్నాను. ఇంతలో వెనక నుంచి ఓకారు వేగంగా వచ్చింది. అది 7 సీటర్ కారు. అందులో ఓ యంగ్ ఫ్యామిలీ ఉంది. ఆ డ్రైవర్ ట్రాఫిక్ జామ్ చూసుకోకుండా దూసుకొచ్చాడు. గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వచ్చాడు. ఈ ప్రమాదంతో ఆ రోడ్డును పూర్తిగా మూసేశారు. చాలా మందికి గాయాలయ్యాయి. అవి తీవ్రమైనవి కావు. నన్ను హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. నా బ్రెయిన్ దెబ్బతింది” అని డేనియల్ వివరించాడు.

గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది..

డేనియల్ పరిస్థితి ఎంత దారుణం అయ్యిదంటే అతని గర్ల్‌ఫ్రెండ్ కేథరీనా అతన్ని వదిలేసింది. ఫ్రెండ్స్‌ని కూడా మర్చిపోయాడు. ఒకప్పుడు తాను ఎవరెవరితో ఉండేవాడో అవేవీ కూడా అతనికి ఇప్పుడు గుర్తులేవు. ప్రమాదం తర్వాత మూడు రోజులకు డాక్టర్ల అనుమతితో కేథరీనా అతన్ని కలిసింది. సినిమాల్లోలాగా..డేనియల్ తన గర్ల్ ఫ్రెండ్ ని మీరు ఎవరు.. అని అడిగాడు. నాకేమీ గుర్తు రావట్లేదు అన్నాడు. ఆ క్షణం ఆమెకు మతిపోయింది. తాను ఎవరో, ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. నిజానికి వారిద్దరికీ ఓ పిల్లాడున్నాడు. ఆ విషయం ఇప్పుడు డేనియల్‌ డైరీలో చూసుకుంటే తప్ప తెలియదు.

నిజంగా ఒక మనిషి ఇలా అందరిని మర్చిపోయి ఏకాకిలా మిగలటం చాలా దారుణమనే చెప్పాలి. గతం పూర్తిగా మర్చిపోయిన దానికంటే..ఇలా డైలీ మర్చిపోతుంటే..ఇక తను ఎలా బతకగలడు. నిరంతరం పక్కన ఎవరో ఒకరు ఉండి గుర్తుచేస్తూ ఉండాల్సిందే కదా.

Read more RELATED
Recommended to you

Latest news