కేజీఎఫ్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెబెల్ స్టార్ ప్రభాస్..!

-

స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరో గా భారీ బడ్జెట్ తో కేజీఎఫ్‌ 2 సినిమా తెరకెక్కింది. ఐతే ఈ సినిమాను భారీ స్థాయిలో ఏప్రిల్ 14 న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఇటీవల వచ్చిన “తుఫాన్ తుఫాన్ ” అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

సౌత్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలలో కే జీ ఎఫ్ చాప్టర్ ఒకటి. ఐతే మేకర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను హైదరాబాద్‌ లోనే నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది.

అయితే.. ఈ ఈవెంట్ కు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హాజరు కానున్నట్లు గా తెలుస్తుంది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సాలార్ ” అనే భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news