నిన్ను తిరుమల శ్రీవారిని 30 3743 మంది దర్శించుకున్నారు. అందులో 11490 ఒకటి మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే శ్రీవారి హుండీ ఆదాయం మూడు కోట్ల 23 లక్షల గా వచ్చింది. ఇక లాక్ డౌన్ తర్వాత శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం ఇదే నని చప్పవచ్చు. ఈ నెల 25న వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉన్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటచనుంది టీటీడీ. రోజుకు పది వేలు చొప్పున లక్ష టోకెన్లు జారీ చేయనుంది టిటిడి. ఇక ఇప్పటికే ఆన్ లైన్ వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల విడుదల చేశారు. 10 రోజులకు 18 వేల టికెట్లను ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేసింది. శ్రీ వాణి ట్రస్ట్ కి పది వేలు విరాళం ఇచ్చిన భక్తులకు టికెట్లను కూడా మరో ఐదు వందలు అదనంగా చెల్లిస్తేనే ఇవ్వనున్నారు.