పాల ప్యాకెట్లులో కప్పలు.. తస్మాత్ జాగ్రత్త !

-

అనంతపురం జిలాలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గర్భిణీ స్త్రీలకు సరఫరా చేసే పాల ప్యాకెట్లులో కప్ప బయట పడింది. పాల ప్యాకెట్లో కప్పను చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురైన మహిళ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకు వచ్చింది. రాయదుర్గం మండలం రాయంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గర్భిణీలు, బాలింతల్లో  రక్తహీనత, క్యాల్షియం సమస్యలను నివారించేందుకు కోసం అంగన్ వాడిల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పాలను సరఫరా చేస్తోంది. ఇప్పటికే గడువు తీరిన పాలను  సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గర్భిణులు బాలింతలు పిల్లల ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా బల్లి బయట పాడడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.  

 

Read more RELATED
Recommended to you

Latest news