యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం

-

కార్తికమాసం చివరి వారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం రోజున భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివాలయం, కార్తిక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. కల్యాణకట్ట, పార్కింగ్‌ ఏరియా, బస్‌ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు రద్దీగా మారాయి. స్వామి వారి దర్శనానికి 4గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. గత ఆదివారం నాటి రికార్డును ఈరోజు ఆదాయం బ్రేక్ చేసింది. కార్తిక మాసం చివరి వారం కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కొండపైన.. ప్రధానాలయ ప్రాంగణం, శివాలయం, విష్ణుపుష్కరిణి, కొండ కింద వ్రత మండపం నిర్వహించారు. లక్ష్మీపుష్కరిణి వద్ద దీపారాధన స్టాళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news