హీరో శ్రీకాంత్ తన భార్యతో విడిపోనున్నారా..?

-

ఏ సినీ ఇండస్ట్రీలోనైనా ఈ మధ్యకాలంలో నటీనటుల విడాకుల వ్యవహారం ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వాస్తవానికి విల్లు విడిపోతున్నారా లేక వీరి పైన కావాలని ఇలాంటి రూమర్లు సృష్టిస్తున్నారా అనే విషయం తెలియడం లేదు. కానీ కొన్ని కొన్ని సమయాలలో అవి మాత్రమే నిజమవుతున్నాయని మరికొన్ని సమయాలలో అవన్నీ రూమర్స్ గా మిగిలిపోతున్నాయని చెప్పవచ్చు. అలా గతంలో నాగచైతన్య, సమంత విషయంలో కూడా సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ చాలా వినిపించాయి. అయితే ఇవన్నీ ఒట్టి రూమర్లే అనుకున్న కానీ ఎప్పుడైతే విరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఈ వార్తలు నిజమయ్యాయి.

ఆ తర్వాత ఎంతోమంది నటీనటులు కూడా విడాకులు తీసుకున్నారనే వార్తలు రాగ అందులో కొన్ని మాత్రమే నిజమయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో సీనియర్ సెలబ్రెటీ దంపతులు కూడా విడిపోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వారు ఎవరో కాదు స్టార్ హీరో శ్రీకాంత్ ఆయన భార్య ఊహ.. శ్రీకాంత్ ఇప్పటికీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో పలు పాత్రలో నటిస్తూ ఉన్నారు. మొదట హీరో శ్రీకాంత్ చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ఉండగా ఆ తర్వాత హీరోగా అడుగుపెట్టి మంచి విజయాలను అందుకున్నారు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కలిగిన హీరో అని కూడా చెప్పవచ్చు.

దాదాపుగా ఇప్పటివరకు 100కు పైగా సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించారు శ్రీకాంత్.ఇక హీరోయిన్ ఊహాను ప్రేమించే వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు.ఇక శ్రీకాంత్ పెద్ద కుమారుడు హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక శ్రీకాంత్ మళ్లీ రీఎంట్రీ తో విలన్ గా పలు సినిమాలలో నటిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి పెడితే ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉండే శ్రీకాంత్ ఊహ విడాకులు తీసుకుంటున్నారనే అని వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆర్థిక పరంగా వీరి మధ్యలో గొడవలు వస్తున్నాయని అందుచేతను విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news