ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసుల నమోదు…! నేడు ఒక్కరోజే 10,093 కొత్త కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో గడచిన 24 గంటల్లో 70,584 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 10,093 మందికి కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పది వేల కేసులు ఒక్కరోజే నమోదు కావడం ఇదే మొదటిసారి. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి ఉగ్రరూపం దాలుస్తోందని చెప్పవచ్చు. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 2784 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

నేడు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,20,390 కు చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 63,771 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18,20,009 మందికి కరోనా వైరస్ సంబంధించి శాంపిల్స్ పరీక్షించడం జరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా బారినపడి 66 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1213 కు చేరుకుంది. ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1676 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక నేటి వరకు కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 179 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version