తెలంగాణ రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. భానుడు సెగులు కక్కుతున్నాడు. దీంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వేసవి మొదలు కాకముందే.. ప్రతి రోజు 40 నుంచి 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో జనాలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే.. జంకుతున్నారు. కాగ బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
అయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 42.4 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇది సాధారణం కన్న ఐదు డిగ్రీలు ఎక్కువని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా కన్న 2 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచే ఎండలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కాగ వచ్చే మూడు రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.