ఆర్థరైటిస్ మొదలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వరకు కర్బూజాతో ఎన్నో లాభాలు..!

-

పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకనే ఎక్కువగా పండ్లు తీసుకుంటూ ఉండాలి. కర్బూజ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఎక్కువ పోషక పదార్థాలతో పాటు నీటి శాతం కూడా ఉంటుంది. పైగా మంచి రుచితో సువాసనతో ఈ పండు ఉంటుంది. నిజానికి కర్బుజా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

కర్బుజా లో పొటాషియం, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బీపీకి కూడా మంచిదే. కంటి ఆరోగ్యానికి కూడా కర్పూజ ఎంతగానో ఉపయోగ పడుతుంది. డయాబెటిస్తో బాధపడే వాళ్లకు ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉంటుంది.

అదే విధంగా బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. కాన్స్టిపేషన్ తో బాధపడే వాళ్లకు కూడా కర్బూజా ఉపయోగపడుతుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బౌల్ మూమెంట్ సరిగ్గా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచడానికి, హృదయ సంబంధిత సమస్యలు తరిమికొట్టడానికి ఇది ఉపయోగ పడుతుంది. క్యాన్సర్ ని కూడా రాకుండా చూసుకుంటుంది. ఆయుర్వేద నిపుణులు కర్బూజాని వేసవికాలంలో తీసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు. అయితే మరి కర్బుజా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు అనేది ఇప్పుడు చూద్దాం.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్:

కర్బూజ తీసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వంటివి ఉండవు. కాబట్టి వీలైనప్పుడు కర్బూజాని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

ఒంట్లో ఉండే చెడు పదార్థాలను తొలగిస్తుంది:

తరచుగా దీనిని తీసుకోవడం వల్ల ఒంట్లో ఉండే చెడు పదార్థాలు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి కర్బూజాని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది:

రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య నుండి బయట పడడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అలాగే చర్మానికి కూడా ఇది బాగా మేలు చేస్తుంది. బ్లీడింగ్ డిజార్డర్స్ వంటివి కూడా ఇది తొలగిస్తుంది. వేడి లేకుండా కూడా హెల్ప్ అవుతుంది. ఇలా కర్బుజా వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను మనం పొందొచ్చు.

డైట్ లో కర్బూజ ని ఎలా తీసుకోవాలి..?

కర్బూజ జ్యూస్:

కర్బూజాపండు గింజలను తొలగించి ముక్కలు కింద కట్ చేసి దానిని జ్యూస్ చేసి తీసుకుంటే మంచిది. ఆరు నెలలు దాటిన పిల్లలకి కూడా ఇవ్వచ్చు.

కర్బూజ మిల్క్ షేక్:

కర్బూజాని ముక్కలు కింద కట్ చేసి పాలు, క్రీమ్, ఐస్ వేసి మిక్స్ చేసి తీసుకోవచ్చు.

కర్బుజా కేర్:

మీరు కావాలంటే కర్బుజా తో కీర్ కూడా చేసుకోవచ్చు. దీనిలో పాలు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని యాడ్ చేసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news