కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు ఈ పరీక్ష తప్పనిసరి…?

-

భారత్ పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండటం ఊరట కలిగిస్తోంది. అయితే వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ చాలామంది అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కోలుకున్న వాళ్లలో ప్రధానంగా ఆయాసం, కండరాళ్ల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి.

మరికొందరు రోగులు రక్తం గడ్డ కడుతున్న సమస్యతో బాధ పడుతున్నారు. దీంతో చాలా మంది రోగుల్లో కరోనా నుంచి కోలుకున్న తరువాత తాము పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నామా…? లేదా…? అనే సందేహం నెలకొంది. దీనికి బెంగళూరు శాస్త్రవేత్తలు ఒక పరిష్కారాన్ని కనిపెట్టారు. డీ డైమర్ అనే పరీక్ష ద్వారా రోగి కరోనా నుంచి కోలుకున్నాడో లేదో సులభంగా తెలుసుకుంటున్నారు. బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రికి చెందిన డాక్టర్ రంజిత్ రెడ్డి వైరస్ లంగ్స్, హార్ట్, ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు.

వైరస్ నుంచి కోలుకున్న వాళ్లలో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తిస్తే మందుల ద్వారా రక్తం పలుచబడేలా చేస్తున్నామని డీ డైమర్ టెస్ట్ అందుకోసం ఉపకరిస్తోందని చెప్పారు. ఈ పరీక్ష కరోనా రోగుల హోం ఐసోలేషన్ గడువు ముగిసిన తర్వాత మాత్రమే చేయించుకోవాలని చెప్పారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్న రోగుల్లో రక్తం గడ్డ కడుతున్న సమస్య ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ క్లినికల్ కెమిస్ట్రీ అండ్ లేబొరేటరీ మెడిసిన్ వైరస్ నుంచి కోలుకున్న వాళ్లు ఈ పరీక్ష చేయించుకోవాలని సూచనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news