పెండ్లయి యేండ్లు గడిచినా సంతానం కలుగదు. కారణం అధికంగా బరువు పెరగడం మరేయితర కారణాలైనా అయ్యిండొచ్చు. మనకు తెలిసిన కారణాలనైనా అధిగమిస్తే సంతానం కలిగొచ్చు. ఈ ఎరుపురంగు అరటిపండ్లు ఆరోగ్యానికి ఏ విధంగా సాయపడుతాయో చూద్దాం.
1. బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజుకో ఎరుపు రంగు అరటిపండు తింటే చాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మామూలు అరటిపండ్లతో పోలిస్తే ఎరుపురంగు అరటిపండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు రోజుకో అరటిపండును తింటే మంచిది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో ఆహారం తక్కువ మోతాదులో తీసుకుంటారు. బరువు కూడా తగ్గడం కాయమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
2. ఎరుపురంగు అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కీడ్నీ సంబంధిత రోగాలను నయం చేస్తుంది. కిడ్నీలో రాళ్లను తొలిగిస్తుంది. క్యాన్సర్ బారినపడకుండా చూస్తుంది. ఎరుపురంగు అరటిపండ్లకు పంటినొప్పులను దూరం చేసే గుణముంది. ఛాథిలో మంటతో ఇబ్బంది పడేవారు ఎరపు అరటిపండును తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.
3. ఎరుపు రంగు అరటి అజీర్తి, ఫైల్స్, కంటి దృష్టి లోపాలను తొలిగిస్తుంది. రోజుకు ఓ అరటిపండును 21 రోజులపాటు తీసుకుంటే కంటి దృష్టి లోపాలతోపాటు విటమిన్ సి లోపం తొలిగిపోతుంది. ఎరుపురంగు అరటిలో ఐరన్, క్యాల్షియం అధికం. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు రోజు ఓ ఎరుపు అరటిని తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు మెరుగుపడతాయట.