దేశంలోని చాలా రాష్ట్రాలలో జరుగుతున్న విధంగానే రాజస్థాన్ లో జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పక్కలో బల్లెంలాగా సొంత పార్టీలోని మరో వర్గం సచిన్ పైలట్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక తాజాగా జరుగుతున్న ఒక విషయం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని తలక్రిందులు చేసేలా ఉంది. కాంగ్రెస్ నేత రాజేంద్ర గుడా ఒక ఎర్ర డైరీని అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు. ఈ డైరీని చూడగానే అశోక్ గెహ్లాట్ నాయకత్వం వణుకుతోంది అన్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ లో రాజేంద్ర గుడా మాట్లాడుతూ… అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎన్నో ఆర్ధిక అవతవకలకు పాల్పడిందని ఆరోపించారు. గతంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మేంద్ర రాథోడ్ ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు దొరికిన డైరీ ఇది గుడా అసెంబ్లీ లో తెలియచేశారు. రాజస్థాన్ సీఎం చెప్పిన మాట ప్రకారమే అప్పుడు నా దగర ఉంచుకున్నాను అన్నాడు. ఈ డైరీలో ఆర్ధిక సంబంధమైన చాలా విషయాలు ఉన్నాయంటూ గుడా కుండబద్దలు కొట్టాడు.
ఈ డైరీలో ఎమ్మెల్యే లకు డబ్బులు ఇచ్చిన విషయాన్నీ రాథోడ్ రాసినట్లుగా గుడా చెప్పాడు. ఇంకా ఇందులో ఎన్ని విషయాలు ఉన్నాయో … అవి ఎలా ప్రస్తుత ప్రభుత్వానికి దెబ్బ కానున్నాయి తెలియాల్సి ఉంది.