నేడు విడుద‌ల అయిన షావోమి దమ్‌దార్‌ స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర తెలిస్తే షాక్‌..!

-

షావోమి మరో కొత్త ఫోన్‌ను నేడు మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. రెడ్‌మి 7ఏ వారసుడిగా భారతదేశంలో రెడ్‌మి 8ఏ లాంచ్ చేయబడింది. బడ్జెట్‌ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఆకర్షణీమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్‌ను ఈ రోజు లాంచ్ చేశారు. దీని ధర రూ. 6,499 నుండి ప్రారంభం అవుతుంది. వాస్తవానికి షావోమి సంస్థ విడుదల చేసే దాదాపు అన్ని ఫోన్లు మొట్టమొదట చైనా మార్కెట్‌లో రిలీజ్‌ అయిన తర్వాత ఇండియాలో ప్రవేశించటం చాలాకాలంగా మనం చూస్తూ ఉన్నాం.

అయితే దానికి భిన్నంగా భారతీయ మార్కెట్‌ యొక్క సామర్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని షావోమి రెడ్‌మి 8ఏని మొట్టమొదట ఇండియాలో విడుదల చేయాలని ఆ సంస్థ నిర్ణయించుకోవ‌డం విశేషం. రెండు వేరియంట్లలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెల 30 నుంచి విక్రయానికి లభ్యం. ఇక దీని స్పెషాలిటీస్ విష‌యానికి వ‌స్తే.. దమ్‌దార్‌ రెడ్‌మి 8ఏలో వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం, టైప్‌ సీ చార్జర్‌ స్పెషల్‌ ఫీచర్‌ లాంటి ఎనిమిది దమ్‌దార్‌ ఫీచర్లున్నాయని అని కంపెనీ చెబుతోంది.

ఇక రెడ్‌మీ 8ఏ ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి.. రెడ్‌మీ 8ఏ 6.22 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ, టైప్ సీ పోర్ట్, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్, నాచ్ డిస్‌‌ప్లే, 2/3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 12 ఎంపీ రియర్‌ కెమెరా మ‌రియు 8 ఎంపీ ఏఐబ్యూటీ సెల్పీకెమెరాతో ఈ స్మార్ట్ మ‌న‌కు ల‌భిస్తుంది. ఇలాంటి అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరకే రెడ్‌మీ 8ఏ అందిస్తుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news