మార్కెట్లో లభిస్తున్న కొత్త యాప్స్ వల్ల క్షణాల్లో అన్ని తెలుసుకునే వెసులుబాటు వచ్చింది. ఈ హెల్త్ యాప్స్‌ను ఈ కాలంలో ఎక్కువగా వాడుతున్నారు.టెక్నాలజీ పెరిగింది. అరచెతిలోనే ప్రపంచం ఉంది. ఇది వరకు అన్నింటికీ హస్పిటల్‌కు వెళ్లాల్సి వచ్చేది. వాటి ఫలితాలకు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు త్వరగా అన్ని తెలుసుకునే అవకాశం ఏర్పడింది. దీనిని నేటితరం విపరీతంగా వాడుతున్నారు. వీటి వల్ల ఫిట్‌నెస్, నిద్ర వివిధ రకాల వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
నేటి తరం యువతకు మొబైల్ యాప్స్ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లలో ఉపయోగిస్తారు. ఇటీవలి కాలంలో వీటి వినియోగం పెరగడం వల్ల 2020 చివరినాటికి ప్రపంచ mHealh మార్కెట్ విలువ 49 బిలియన్లకు చేరుకుంది.
డయాబెటీస్ యూసేజ్
డయాబెటిక్ పేషంట్ల కోసం కొన్ని హెల్త్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ హెల్త్ యాప్స్ ఆరోగ్య సంరక్షణకు బాగా ఉపయోగపడుతున్నాయి. వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఆరోగ్య స్థితిగతులను, రోగ నిర్ధారణ వంటి చాలా మంది వాటిని సులభంగా ట్రాక్ చేయగలుగుతున్నారు. 1070 డయాబెటిక్ రోగులు మూడు నెలల పాటు అధ్యయనం చేసి వీరిలో కొంతమంది మొబైల్ హెల్త్ యాప్ ఉపయోగించగా, మరికొంత మంది ఉపయోగించలేదు. ఆసక్తికరంగా మొబైల్ యాప్స్ వాడిన వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది. అంతేకాకుండా వీటిని వాడినవారి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకున్నారు. హెల్త్ యాప్‌లలో ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యాన్ని ట్రాక్ చేయగలగడం వల్ల వైద్య ఖర్చులు కూడా తగ్గాయని అధ్యయనవేత్తలు తెలిపారు. మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం రీసెర్చ్ సెంటర్ పబ్లికేషన్‌కు చెందిన ఎంఐఎస్ క్వార్టర్లీ అనే జర్నల్ ప్రచూరించింది.
49 బిలియన్ డాలర్లకు mHealth మార్కెట్ కాగా ఈ అధ్యయనాన్ని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం,న్యూయర్క్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు. ‘ప్రజలు తమ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల వారి జీవనశైలిని మార్చుకుంటారు. దానివల్ల వారు త్వరగా డయాబెటీస్ వంటి రుగ్మతల నుంచి సులభంగా బయటపడగలర’ని అధ్యయనవేత్తలు అన్నారు.